sirivennela sitarama sastry: ప్రతి పెళ్లి పందిరిలో వాళ్లిద్దరి పాటలే..

X
By - Prasanna |30 Nov 2021 5:33 PM IST
sirivennela sitarama sastry: ప్రతి ఇంటి ఆడపడుచుకీ తన పెళ్లి రోజు గుర్తుకు వస్తుంది. సిరివెన్నెల పాటలోని పవర్ అది.
sirivennela sitarama sastry: తెలుగింట పెళ్లి జరిగితే ప్రతి ఇంటా ఆ పాటలే వినిపిస్తుంటాయి. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది క్రొత్తజీవితం అంటూ బాపు చిత్రం 'పెళ్లి పుస్తకం'లో ఆరుద్ర రాసిన గీతం పెళ్లి పందిళ్లలో మార్మోగుతుంటుంది.
మరో లెజెండ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తీసిన 'మురారి' చిత్రంలోని సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి.. ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ... ఆ... అంటూ సాగే గీతం వింటే ప్రతి మదీ పులకరిస్తుంది.. ప్రతి ఇంటి ఆడపడుచుకీ తన పెళ్లి రోజు గుర్తుకు వస్తుంది. సిరివెన్నెల పాటలోని పవర్ అది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com