Sita Payanam Movie : సీరియల్ లా సాగే సీతా పయనం

యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన సినిమా సీతా పయనం. ఇదే మూవీతో మరో స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకును హీరోగా పరిచయం చేశారు. తొలి సినిమాతో ఈ ఇద్దరూ నటనతో మెప్పించారు. బట్ కథ, కథనాలు మాత్రం ఏదో పాతకాలం నాటివిగా ఉన్నాయి. పెద్దగా ఆసక్తిగా సాగని స్క్రీన్ ప్లేతో పాటు సాగదీతగా సాగే సన్నివేశాలతో ఇబ్బంది పెట్టాడు అర్జున్.
సీతకు చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి తండ్రే అన్నీ అయ్యి పెంచుతాడు. పెద్దయ్యాక తనో పెద్ద చెఫ్ గా మారుతుంది. వైజాగ్ లో సెటిల్ అవుతుంది. ఓ సారి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ చెఫ్ ప్రోగ్రామ్ ఉందని సీత తను కూడా వెళ్లాలనుకుంటుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు కార్ లో వెళ్లాలనుకుంటుంది. ఆ ప్రయాణంలో అభిషేక్ అనే కుర్రాడు లిఫ్ట్ అడుగుతాడు. చాలా విధాలుగా చెక్ చేసిన తర్వాత లిఫ్ట్ ఇస్తుంది సీత. ఆ మొత్తంలో ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నట్టు కనిపిస్తాయి. తర్వాత సీత హైదరాబాద్ కు వెళుతుంది. తీరా తను చెఫ్ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే కొన్ని క్షణాల ముందు అక్కడ ఓ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. దీంతో సీత భయపడిపోతుంది. తర్వాత తను ఇంత ఆలస్యం చేయడానికి కారణమైన ఈ జర్నీలో కలిసిన మనుషులందరినీ మళ్లీ కలిసి థ్యాంక్స్ చెప్పాలనకుంటుంది. ఈ క్రమంలో అభితో ప్రేమలో కూడా పడుతుంది. అందులో భాగంగా అభితో కలిసి హైదరాబాద్ నుంచి మళ్లీ వైజాగ్ వెళుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ సాగదీతకు అర్థం చెప్పేలా సాగడం చాలా పెద్ద రిస్క్ గా ఉంటుందీ మూవీ.
కథగా బానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ కథనం మాత్రం మరీ పాతగా ఉంటుంది. అస్సలే మాత్రం ఇంట్రెస్టింగ్ సీన్స్ తో వీలైనంత విసిగించాడు దర్శకుడు అయిన అర్జున్. అఫ్ కోర్స్ ఒకటీ అరా మాత్రం మంచి సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బట్ అప్పటికే ఆలస్యం అవుతుంది. మొత్తంగా నటీ నటులు ఇద్దరూ ఫస్ట్ మూవీ అయినా బానే మెప్పించారు. ఓ రకంగా చూస్తే సీరియల్ లా సాగే కథనం చాలా పెద్ద మైనస్ గా అయిందీ మూవీకి. అందుకే చాలా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రిజల్ట్ తెలిసిన తర్వాత ఇంకసలు ఎవరూ పట్టించుకోలేదీ మూవీని.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
