Sita Ramam Twitter Review : మణిరత్నం ప్రేమకథల్ని తలపించిన సీతారామం..

Sita Ramam Twitter Review : మళయాలి స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకుడు హను రాఘవపూడి సినిమా సీతారామం ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రయిలర్‌లో చూపించినట్లుగానే కథ మొత్తం రామ్, సీతా అనే ఇద్దరి ప్రేమికుల చుట్టే తిరుగుతుంది.
కథ విషయానికి వస్తే.. రామ్ గతంలో మిలిటరీలో లెఫ్టెనెంట్‌గా పనిచేస్తాడు.. సీత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ఎప్పుడో 60 కాలంలో రాసిన లేఖ ఇప్పుడు అఫ్రీన్ అనే అమ్మాయికి చిక్కుతుంది. ఆ లెటర్‌ను పట్టుకొని అఫ్రీన్ రామ్ సీతా కోసం వెతకడం ప్రారంభిస్తుంద. ఈ తరుణంలో రామ్‌ను ట్రయిన్ చేసిన విష్ణశర్మకు ఈ విషయం తెలుస్తుంది. వెంటనే అఫ్రీన్‌ను రప్పిస్తాడు. అప్పటి నుంచి కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
హను రాఘవపూడి సినిమా అయినప్పటికీ మణిరత్నం ఫీల అనిపించే రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. 60, 70 కాలంలోని ప్రేమకథలెలా ఉండేవో బాగా ప్రెజెంట్ చేశారు. మొత్తంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సీతారామం ఓ మంచి ప్రేమ కథ అని చెప్పుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com