Sita Ramam OTT : సీతారామం ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Sita Ramam OTT : సీతా రామం సినిమాను థియేటర్లో చూసిన ప్రేక్షకులు మరోసారి ఓటీటీలో కూడా చూడడానికి తహతహ లాడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ గుడ్ న్యూస్. సీతారామం మూవీ సెప్టెంబర్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది.
ఉహకందని రీతిలో సీతారమం పెద్ద సక్సస్‌ను సొంతం చేసుకుంది. ప్రభాస్ రాధేశ్యామ్ కన్నా మంచి క్లాసిక్ మూవీ అని అనేక మంది క్రిటిక్స్ సైతం రివ్యూస్ ఇచ్చారు. ఈ సినిమా నచ్చని వారెవరూ లేరంటే సినిమా ఎంత బాగా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించారు. హను రాఘవపూడి దీనికి దర్శకత్వం వహించారు. యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఓ అందమైన ప్రేమ కథే ఈ సీతారామమ్.
అనాధ అయిన హీరో రామ్ ఆర్మీలో చేరుతాడు. తరువాత ఓ అందమైన అమ్మాయి సీతామహాలక్ష్మిని ప్రేమిస్తాడు. ఇదంగా 1960 కాలానికి చెందింది. అయితే సుమారు 25 ఏళ్ల తరువాత ఓ పాకిస్తానీ అమ్మాయి ఆఫ్రీన్‌కు రామ్ రాసిన లేఖ అందుతుంది. ఈ లేఖను సీతామహాలక్ష్మికు అందించాలని అఫ్రీన్ తాతయ్య (పాకిస్తాన్ మిలిటరీ మేజర్) అఫ్రీన్‌కు బాధ్యతలను అప్పజెపుతాడు. ఈ కథ మొత్తం తెలియాలంటే ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 9 నుంచి చూసెయ్యండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com