Mahesh Babu: నాన్నకు పోటీ.. సర్కారు వారి పాటలో క్యూటీ..

Mahesh Babu: మహేష్ బాబు కూతురు ఫెర్ఫార్మెన్స్ మామూలుగా లేదుగా.. సరిలేరు నాకెవ్వరూ అంటూ సర్కారు వారి పాటలోని కళావతి పాటకు అద్దిరి పోయే స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఆ సినిమాలోని పెన్సీ సాంగ్ లో సితార కనిపిస్తోంది.. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన ప్రోమోని శనివారం ఉదయం విడుదల చేశారు. తన ఫెర్ఫార్మెన్స్ తో మరోసారి అలరించనుంది అని మహేశ్ పేర్కొన్నారు.
పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహేష్ గారాల పట్టి సితార మొదటి సారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది పెన్నీ పాట ద్వారా. ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆదివారం విడుదలయ్యే పెన్నీ ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సితార హాలివడ్ యానిమేషన్ మూవీ ప్రోజెన్ 2 తెలుగు వెర్షన్ లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్ ఓవర్ అందించింది. ఇప్పుడు సర్కారు వారి పాటలో తన డ్యాన్స్ తో అదరగొట్టనుంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
She's stealing the show... once again!! 😎#Penny out tomorrow!https://t.co/g2uXcd3i8F@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth
— Mahesh Babu (@urstrulyMahesh) March 19, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com