Sitara: తాతా ఇక ఆ రోజు ఎప్పటికీ ఉండదు.. సితార భావోద్వేగ పోస్ట్

Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, పిల్లలతో గడపడం, తల్లిదండ్రులతో గడుపుతుండేవాడు.. పిల్లలు కూడా తాత, నానమ్మ పట్ల ఎంతో ఆప్యాయత, అనురాగాలతో ఉండేవారు. అందుకే వాళ్లు వెళ్లిపోయిన క్షణాలు వారిని తీవ్రంగా కలిచివేశాయి. వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సితార సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నిన్న మృతి చెందగా, ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో దివంగత లెజెండ్ అంత్యక్రియలు నిర్వహించారు.
మహేష్ బాబు కుమార్తె సితార తన తాత గురించి భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. "వారపు రోజు భోజనం మళ్లీ ఎప్పటికీ ఉండదు. మీరు మాకు చాలా విలువైన విషయాలు నేర్పించారు. ఎల్లప్పుడూ మమ్మల్ని నవ్వించారు. ఇప్పుడు మిగిలి ఉన్నది మీ జ్ఞాపకం మాత్రమే. నువ్వే నా హీరో... ఏదో ఒక రోజు నేను నిన్ను గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ."
సితార తన తాతతో కలిసి దిగిన ఫోటోను పంచుకుంది. ఇది వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com