పిట్టకొంచెం... కూత ఘనం

పిట్టకొంచెం... కూత ఘనం
ప్రముఖ సంస్థకు ప్రచార కర్తగా సీతారా ఘట్టమనేని

ప్రిన్స్ మహేశ్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఘట్టమనేని రాబోయే కాలంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆటపాటల్లో తర్ఫీదు పొందుతోన్న సితార ఇప్పటికే ఓ సెలబ్రిటీ హోదాను ఆశ్వాదిస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పాపులారిటీ సంపాదించుకుంది. అడపాదడపా సిల్వర్ స్క్రీన్ పైనా తళుక్కుమని మెరుస్తోంది. తాజాగా ఆమె స్టార్ డమ్ కు మచ్చుతునకగా ఓ నగల సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ షూటింగ్ లో పాలుపంచుకుంటోంది. దీనికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదలవ్వగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story