Sita Ramam: 'సీతారామం' జంట.. సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి..

Sita Ramam: సీతారామం జంట.. సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి..
Sita Ramam: సీతారామం సినిమా ఎంత బావుంది.. హీరో హీరోయిన్లు సూపర్‌గా ఉన్నారు అని మూవీని చూసి చాలా మంది హ్యాపీగా ఫీలయ్యారు..

Sitaramam: సీతారామం సినిమా ఎంత బావుంది.. హీరో హీరోయిన్లు సూపర్‌గా ఉన్నారు అని మూవీని చూసి చాలా మంది హ్యాపీగా ఫీలయ్యారు..ఓ మంచి ప్రేమకథను తెరకెక్కించిన హనురాఘవపూడికి ప్రేమతో లేఖలు కూడా రాశారు సినీ ప్రియులు. పాత్రల్లో ఒదిగిపోయిన దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ అద్భుతంగా నటించారు అని అందరూ వారిని ప్రశంసించారు.

ఓ సినిమా హిట్టై, ఆ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బావుంటే వరుస పెట్టి అవకాశాలు అందుకోవడం ఇండస్ట్రీలో కామన్. అదే ఈ చిత్రంలోని జంట విషయంలో కూడా రిపీట్ అయింది. వీరిద్దరితో మరో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా అశ్వనీదత్ నిర్మిస్తున్నారని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అదే నిజమైతే సీతారామం జంటని సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి చూడొచ్చని అభిమానులు తెగసంబర పడిపోతున్నారు.

ఆగస్ట్ 5న విడుదలైన సీతారామం అన్ని చోట్ల మంచి పేరుతో పాటు కలెక్షన్లూ వసూలు చేసింది. సెప్టెంబర్ 2న హిందీ ప్రేక్షకులనూ పలకరించింది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహానటితో మంచి నటుడు అనిపించుకున్న దుల్కర్‌ తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో అయిపోయాడు. అందుకే రామంని తమవాడిగా చేసుకున్నారు. మరాఠీ నటి అయిన సీత (అదేనండి మృణాళ్ ఠాకూర్) కూడా తెలుగు వారి మనసు దోచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story