ఈ జగపతిబాబు 'చెల్లెలు' గుర్తుందా.. ఇప్పుడు పేరు, మతం మార్చుకొని..!

ఈ జగపతిబాబు చెల్లెలు గుర్తుందా.. ఇప్పుడు పేరు, మతం మార్చుకొని..!
సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలో నటించి ఎక్కువ స్టార్ డం సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుగుగవుతుంటారు కొందరు నటీనటులు.

సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలో నటించి ఎక్కువ స్టార్ డం సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుగుగవుతుంటారు కొందరు నటీనటులు.. ఆ కోవా కిందికే వస్తుంది మోనిక.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇందిరా' అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌గా నటించి హీరోయిన్‌‌‌గా ఎదిగింది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించింది.

తెలుగులో జగపతిబాబు హీరోగా వచ్చిన 'శివరామరాజు' సినిమాలో స్వాతి అనే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'మా అల్లుడు వెరీగుడ్', 'కొడుకు', 'పైసాలో పరమాత్మ' చిత్రాల్లో నటించింది. సినిమాలలో అవకాశాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో ముస్లిం మతాన్నీ స్వీకరించింది. తన పేరుని ఎంజి రహీమాగా మార్చుకుంది.

"బాలనటిగా మొదలైన నేను.. ఇన్నేళ్ళుగా సినీరంగంలో విజయవంతంగా కొనసాగడానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు. ఈ రంగాన్ని వదిలివెళ్లడం కష్టంగా ఉన్నా, తప్పడం లేదు'' అని మీడియాకి ఇచ్చిన ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా డబ్బు కోసమో, ఏదో ప్రేమ వ్యవహారం కోసమో తాను మతం మార్చుకోలేదని, తాను అలాంటి అమ్మాయిని కాదని, ఇస్లామ్‌లోని అంశాలు నచ్చడం వల్లే మతం మారానని తెలిపింది.


కాగా మోనిక తండ్రి హిందువు కాగా, తల్లి క్రిస్టియన్. మోనికకి కృష్ణ, మోనిక, రేఖ, పర్వాన, రహిమా అనే పేర్లు కూడా ఉన్నాయి. మోనిక 2015లో మాలిక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమె భర్త చెన్నైలో వ్యాపారవేత్త. ఎలక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేస్తూ ఉంటారు. మోనిక తండ్రి, మాలిక్ తండ్రికి మధ్య సానిహిత్యం ఉండడంతో మౌనిక, మాలిక్ల మధ్య స్నేహబంధం ఏర్పడి అది వివాహ బంధానికి దారి తీసింది.

కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో మోనిక నటిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story