Sivaji and Laya : మరోసారి జంటగా శివాజీ, లయ

Sivaji and Laya : మరోసారి జంటగా శివాజీ, లయ
X

వెండితైరపై ఆకట్టుకున్న భార్యాభర్తల కాంబినేషన్స్ కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి శివాజీ, లయ. మరోసారి వారిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది. గతంలో వీరిద్దరు కలిసి అదిరిందయ్యా చంద్ర, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మ చిత్రాల్లో నటించారు. కొంత గ్యాప్ తర్వాత శ్రీశివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోంది ఈ సినిమా.

ఈ మూవీ నేపథ్యం క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా తో సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ నెల 20 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Tags

Next Story