Siva Karthikeyan : నన్ను అన్న అని పిలిచినందుకు బాధపడ్డా : శివకార్తికేయన్

బాన్సువాడ భానుమతిగా ప్రేక్షకులను ఫిదా చేసిన నటీమణి సాయిపల్లవి.. అభినయం.. డ్యాన్స్ తో ప్రేక్షులను మదిని దోచేస్తుందీ భామ. సాయిపల్లవి తనను అన్న అని పిలిచినందుకు బాధపడ్డానంటున్నాడు ఓ హీరో.. ఆ హీరోయే శివకార్తికేయన్. 'అమరన్' అనే తమిళ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హీరో శివకార్తికేయన్ ఈ విషయాలను బయటపెట్టారు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి నటిస్తున్న సినిమా అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల 31న తెలుగుతమిళ భాషల్లో రిలీజ్ కానుంది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యేంతవరకు వచ్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సాయిపల్లవితో జరిగిన ఫన్నీ సంఘటననే ఇప్పుడు బయటపెట్టాడు. 'గతంలో నేను టీవీ ఛానెల్లో పనిచేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత 'ప్రేమమ్'లో ఈమె నటన నాకు తెగ నచ్చేసింది. దీంతో ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను. వెంటనే 'థ్యాంక్యూ అన్న' అనేసింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాను' అని చెప్పాడు శివకార్తికేయన్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ హైబ్రిడ్ పిల్ల తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ లేదా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుందనే వార్తలందుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com