Sivakarthikeyan: తమిళ హీరో కోసం ఏకంగా ఉక్రెయిన్ భామ..

Sivakarthikeyan: ఇటీవల కాలంలో హీరోయిన్‌ను సెలక్ట్ చేసుకునే సమయంలో దర్శక నిర్మాతలు చాలా ఆలోచిస్తున్నారు. ఏ హీరోయిన్‌ను తీసుకుంటే వారి సినిమాకు ప్రమోషన్‌గా మారుతుంది అనే అంశాలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. పైగా ఫారిస్ భామలను కూడా ఇండియన్ సినీ పరిశ్రమలో ఇంట్రడ్యూస్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్‌కు చెందిన భామతో రొమాన్స్ చేయనున్నాడు తమిళ హీరో.
ఈమధ్య తెలుగు, తమిళం అని తేడా లేకుండా దర్శకులు, నటీనటులు అంతా ఒకే భాషా పరిశ్రమలాగా కలిసి పనిచేస్తున్నారు. అందుకే తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు దర్శకుడు అనుదీప్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి ఓ వార్త వైరల్‌గా మారింది.
అనుదీప్‌తో తెరకెక్కుతున్న సినిమా హీరోగా శివకార్తికేయన్ కెరీర్‌లో 20వ చిత్రం. అందుకే దీనిని తనతో పాటు ఇతర టీమ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఏకంగా ఉక్రెయిన్ భామను రంగంలోకి దింపనున్నాడట అనుదీప్. ఉక్రెయిన్‌కు చెందిన నటి మరియా రియాబోషప్కా ఇందులో హీరోయిన్‌గా కనిపించనున్నట్టు సమాచారం.
మరియా కాకుండా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందట. 'జాతిరత్నాలు'తో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న అనుదీప్.. శివకార్తికేయన్‌తో తెరకెక్కిస్తు్న్న సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక బీస్ట్ సినిమా అరబిక్ కుతు అనే పాట రాసినందుకు శివకార్తికేయన్ పేరు అంతటా మారుమోగిపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com