Sivakarthikeyan : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న శివకార్తికేయన్

మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి యాంకర్ గా మారి, యాంకర్ నుంచి హీరో అయ్యాడు శివకార్తికేయన్. టైర్ 3 హీరోల్లో ఒకడుగా మిగిలిపోతాడులే అనుకున్నారు చాలామంది. బట్ అతను కథలను నమ్ముకున్నాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ టైర్ 1 వైపు వేగంగా దూసుకువస్తున్నాడు. గతేడాది వచ్చిన అమరన్ కోలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అంతే కాదు.. ఈ మూవీతో తెలుగులోనూ తన మార్కెట్ సత్తాను నిరూపించకున్నాడు. ఏకంగా 40 కోట్ల వరకూ తెలుగులో వసూలు చేసింది అమరన్.
ఇక ఇప్పుడు రెండు సినిమాలతో రెడీ అవుతున్నాడు శివకార్తికేయన్. అందులో ఒకటి పరాశక్తి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని సుధా కొంగర డైరెక్ట్ చేస్తోంది. జయం రవి విలన్ గా నటిస్తున్నాడు. దీనికి ముందే కమిట్ అయిన సినిమా మదరాసి. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. గతేడాది విజయ్ హీరోగా నటించిన గోట్ రిలీజ్ డేట్ నే శివకార్తికేయన్ లాక్ చేసుకున్నాడు.
మదరాసిని సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మదరాసిలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్. బిజూ మీనన్, విద్యుత్ జామ్ వాల్ కీలక పాత్రలు చేస్తున్నారు. మొత్తంగా విజయ్ తర్వాతి స్థానాన్ని భర్తీ చేస్తాడు అనే అంచనాలున్నాయి శివకార్తికేయన్ పై. అందుకు తగ్గట్టే విజయ్ ఫ్యాన్స్ ఇతనివైపు చూస్తున్నారిప్పుడు.
అమరన్ తో తెలుగులో మెరిశాడు కాబట్టి.. మదరాసికి తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com