Sivakarthikeyan : పరాశక్తిగా వస్తోన్న శివకార్తికేయన్

స్వయంకృషితో స్టార్డమ్ తెచ్చుకున్ను హీరో శివకార్తికేయన్. మొదట పక్కింటి కుర్రాడు తరహా వేషాలే వేసినా.. తర్వాత మెల్లగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయినా క్లాస్ హీరోగానే ఎక్కువగా ట్రీట్ చేస్తారతన్ని. కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్ పైనా కన్నేసిన శివకార్తికేయన్ లాస్ట్ ఇయర్ వచ్చిన అమరన్ తో అదీ సాధించాడు. ఈ మూవీ ఇక్కడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాదు.. 2024లో తమిళనాడులోనే హయ్యొస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది అమరన్. దీనికి తోడు గోట్ మూవీలో విజయ్ అతనికి తుపాకీ ఇచ్చే సీన్ తో తన తర్వాతి స్థానం శివకార్తికేయన్ దే అని చెప్పకనే చెప్పాడు అనుకున్నారు కోలీవుడ్డోళ్లు. అన్నట్టుగానే విజయ్ ఫ్యాన్స్ ఇతనివైపు టర్న్ అవుతున్నారు కూడా. ఇక విషయం ఏంటంటే.. శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’. ఈ మూవీ టైటిల్ టీజర్ అనౌన్స్ చేశారు. ఇది చూస్తూనే ఖచ్చితంగా హీరోగా అతని రేంజ్ ను డబుల్ చేయబోతోంది అనిపించేలా ఉంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకురాలు. టైటిల్ టీజర్ తోనే మెస్మరైజ్ చేసిందని చెప్పాలి.
చాలాకాలం క్రితం మద్రాస్ లోని ఓ కాలేజ్ లో జరిగే కథగా మొదలైందీ టీజర్. టీజర్ ఆరంభంలోనే.. ఓ గోడపై ‘స్టూడెంట్స్ డోన్ట్ టచ్’(విద్యార్థులు ముట్టుకోవద్దు) అన్న లైన్స్ కనిపిస్తాయి. సజెషన్ లో అక్కడికి వెళ్లిన హీరో అక్కడ దేన్ని టచ్ చేయకూడదు అన్నారో దాన్నే టచ్ చేస్తాడు. కట్ చేస్తే మరో కుర్రాడు అధర్వ.. ఎంట్రీ. కాలేజ్ గొడవలు.. అతన్ని తరమడం.. వెంటనే ఓ వింటేజ్ కార్లో అక్కడికి వచ్చిన శ్రీ లీల తన కార్లో ఎక్కించుకుంటుంది. ఒక ట్రంక్ కాల్ (ఫోన్) చేస్తే సరిపోదా అంటే.. ‘‘నేను రాకుండుంటే చచ్చుండేవాడివిరా’’ అని తెలుగులో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దీనికంటే ఎక్కువగా మొన్నటి వరకూ జయం రవిలా ఉండి రీసెంట్ గా తన పేరును రవి మోహన్ గా మార్చుకున్న హీరో విలన్ పాత్ర చేస్తున్నట్టు కనిపిచండం.. ఈ టీజర్ అంతా అతను అదే పనిగా ఓ బొమ్మను కాలుస్తూ ఉండటం.. చివర్లో ఆ బొమ్మకు ఉన్న ఫేస్ శివకార్తికేయన్ దిగా రివీల్ కావడం చూస్తే సుధా కొంగర టేకింగ్ కు ఫిదా అవుతాం. ఇక కాలేజ్ టెర్రస్ పైకి ఎక్కిన శివకార్తికేయన్.. ‘మనకో ఆర్మీ కావాలి.. చాలా పెద్ద ఆర్మీ కావాలి ’ అని నినాదాలు చేస్తే స్టూడెంట్స్ దాన్ని రిపీట్ చేయడం.. చివర్లో ఏదైతే ‘స్టూడెంట్స్ డోన్ట్ టచ్’ అనే లైన్ ఏదైతే ఉందో దాన్ని ‘డోన్ట్ టచ్ స్టూడెంట్స్ ’ అనే లైన్ గా మార్చడం కనిపిస్తోంది.
మొత్తంగా ఈ పరాశక్తి అనౌన్స్ మెంట్ తోనే సంచలనం సృష్టించింది సుధా కొంగర. టైటిల్ కు కంటెంట్ కు పెద్దగా సంబంధం లేనట్టు కనిపిస్తున్నా.. సినిమా చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఇక ఈచిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ అందిస్తోన్న సంగీతం మరో హైలెట్ కాబోతోందని ఈ అనౌన్స్ మెంట్ తోనే అర్థం అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com