Sivakarthikeyan : శివకార్తికేయన్ కు విలన్ గా స్టార్ హీరో

శివకార్తికేయన్ దూకుడు పెంచుతున్నాడు. అతని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అమరన్ తో కోలీవుడ్ టైర్ 1 హీరోల లిస్ట్ లోకి చేరాడు అంటున్నారు. ఈ మూవీతో కెరీర్ బెస్ట్ అనిపించుకునే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించాడు. అతని నటనకు అంతా ఫిదా అయిపోయారు. అమరన్ అతనికి తెలుగులోనూ స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసింది. ఈ వసూళ్లను నిలుపుకుంటూ.. మరో రెండు మూడు హిట్స్ పడితే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లోకి ఎంటర్ అయిపోతాడు. అలాంటి సినిమానే ఇది అనేలా ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివకార్తికేయన్.
గురు, ఆకాశం నీ హద్దురా వంటి మూవీస్ తో అదరగొట్టిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. ఇది 1960స్ లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రూపొందే సినిమా అని టాక్. ఈ చిత్రంలో అతనికి విలన్ గా మరో కోలీవుడ్ స్టార్ జయం రవి నటించబోతుండటం విశేషం. జయం రవితో పాటు గద్దలకొండ గణేష్ లో నటించిన అధర్వ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. తనకు ఇదే ఫస్ట్ కోలీవుడ్ మూవీ. శివకార్తికేయన్ ఓ రెబల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడట.
శివకార్తికేయన్ ను కోలీవుడ్ కు కాబోయే ‘విజయ్’అంటున్నారు. ఆ రేంజ్ కు వెళ్లే సత్తా అతనిలో ఉంది అనేది చాలామంది నమ్మకం. పైగా అతనికి విజయ్ సపోర్ట్ ఉంది. విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లాడు కాబట్టి.. ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఇతనే అనేది అందరి ఆలోచన. అందుకు తగ్గట్టుగా శివకార్తికేయన్ తో పాటు నటిస్తోన్న జయం రవి, అధర్వలకు బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది. అదేం లేని హీరోకు జయం రవి విలన్ గా నటించడం అంటే అది శివకార్తికేయన్ టాప్ లీగ్ లోకి ఎంటర్ అవుతున్నట్టే అనేందుకు సంకేతం అంటున్నారు. మరి ఈ హిందీ వ్యతిరేక ఉద్యమ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com