Goodachari 2 : ‘గూఢచారి-2’ నుంచి ఆరు క్రేజీ స్టిల్స్

Goodachari 2 : ‘గూఢచారి-2’ నుంచి ఆరు క్రేజీ స్టిల్స్
X

వినూత్న సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న ‘గూఢచారి-2’ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ‘గూఢచారి’ రిలీజై ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘GA2’ నుంచి ఆరు క్రేజీ స్టిల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్నారు.

‘గూఢచారి’ కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘గూఢచారి’ విడుదలైన ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జీ2’ నుంచి ఆరు క్రేజీ స్టిల్స్‌ను అడవి శేష్‌ పంచుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Tags

Next Story