Pottel : ఈ వారం టాలీవుడ్ సిక్సర్ కొడుతోంది.

Pottel :  ఈ వారం టాలీవుడ్ సిక్సర్ కొడుతోంది.
X

ప్రతి వారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రాపర్ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల.. సరైన స్టార్ కాస్ట్ లేకపోవడం అవేంటో ఆడియన్స్ కు తెలిసేలోపే థియేటర్స్ నుంచి వెళ్లిపోతున్నాయి. లేదా అలాంటివే మరికొన్ని సినిమాలు తర్వాతి వారం విడుదలవుతున్నాయి. కాకపోతే ప్రతి వారం కాస్త ఎక్కువ తెలిసినవీ.. తెలిసేలా ప్రమోషన్స్ చేసినవీ వస్తున్నాయి. ఆటోమేటిక్ గా అందరి దృష్టీ ఆ సినిమాల వైపే వెళ్లిపోతుంది. మొత్తంగా పెద్దగా కనిపించడం లేదు కానీ.. ఈ వారం కూడా ఏకంగా 6 సినిమాలు విడుదలవుతున్నాయి.

ఈ మొత్తంలో ఎక్కువగా ఫోకస్ లో ఉన్న సినిమా ‘పొట్టేల్’. యువచంద్ర, అనన్య నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కోసం పెద్దవాళ్లు కూడా మాట సాయం చేస్తున్నారు. అన్నిటికి మించి ట్రైలర్ తో మెస్మరైజ్ చేశాడు దర్శకుడు సాహిత్. ఇదే అందరి అటెన్షన్ ను డ్రా చేసింది. పైగా చిత్రాన్ని మైత్రీ మూవీస్ వాళ్లు విడుదల చేస్తున్నారు. దీంతో మరింత హైప్ వచ్చింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ చిన్న ప్రమోషన్ కోసం మూవీ టీమ్ చాలాకాలంగా హార్డ్ ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది.

నెక్ట్స్ లగ్గం అనే మరో సినిమా విడుదలవుతోంది. సాయి రోనక్, ప్రగ్యా నగరా జంటగా నటించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ చాలామంది నటించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా. ప్రమోషన్స్ పరంగా మరీ ఎక్కువగా కనిపించలేదు. కాకపోతే ఇప్పటి వరూ వచ్చిన కంటెంట్ ఆకట్టుకుంది.

కంటెంట్ పరంగా ఆకట్టుకుంటోన్న మరో మూవీ నరుడి బ్రతుకు నటన. శివకుమార్, సృష్టి, రిషియోగి, నితిన్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు కేరళ బ్యాక్ డ్రాప్ కూడా కనిపిస్తోంది. కంటెంట్ కాస్త డిఫరెంట్ గానే ఉంది. బట్ ఆ విషయాన్ని ఆడియన్స్ వరకూ తీసుకువెళ్లడంలో టీమ్ పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పలేం.

ఇక ఎన్నాళ్లుగానో సోషల్ మీడియాలో కనిపిస్తోన్న రోటీ కపడా రొమాన్స్ తో పాటు గ్యాంగ్ స్టర్ అనే సినిమా.. అలాగే బి గ్రేడ్ మూవీస్ క్వాలిటీలో కూడా లేని ఎంత పనిచేశావ్ చంటి అనే చిత్రాలు ఈ నెల 25న విడుదల కాబోతున్నాయి. సో.. ఒక్క పొట్టేల్, లగ్గం తప్ప మిగతావన్నీ ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా వస్తున్నవే.

Tags

Next Story