Skanda: యూట్యూబ్ ను ఊపేస్తోన్న స్కంద.. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. 'డబుల్ ఇస్మార్ట్' సినిమాతో మరోసారి థియేటర్లను షేక్ చేయనున్న ఈ హీరో ఇప్పుడు మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న ‘స్కంద’ తో వస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ‘నీ చుట్టూ చుట్టూ’ సాంగ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రామ్, శ్రీలీల మ్యాజికల్ స్టెప్పులే కనిపిస్తున్నాయి.
రామ్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఈ రోజే రిలీజ్ అయింది. మేకర్స్ ముందు చెప్పినట్టుగానే ఈ పాటను నేడు(ఆగస్టు 3) ఉదయం 9:36 నిమిషాలకు ‘నీ చుట్టూ చుట్టూ’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ పాట ప్రోమోకు విపరీకతమైన రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో రామ్ అభిమానులు మంచి కిక్ ఇచ్చినట్టయ్యింది. ఇక సాంగ్ విషయానికొస్తే.. ప్రోమోలో చూసినట్టే రామ్, శ్రీలీల డాన్స్ అదరగొట్టారు. ‘నీ చుట్టూ చుట్టూ’ అంటూ రామ్, శ్రీలీల వేసే స్టెప్స్ కూడా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఉన్నాయి సాధారణంగానే రామ్ ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తారో మనందరికీ తెలిసిందే. ఇక శ్రీలీల కూడా ధమాకా సినిమాలో ఎలా అదరగొట్టిందో చూశాం. దీంతో వీరిద్దరికీ మంచి జోడీ కుదిరినట్టైంది. రామ్ పక్కన శ్రీలీల పోటీ పడుతూ యాక్టీవ్ గా డ్యాన్స్ ఇరగదీసింది. ఇక ఈ పాటకు తమన్ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. ఈ పాటకు రఘురామ్ సాహిత్యం అందించగా.. సిద్ శ్రీరామ్, సంజన కల్‌మంజీ ఆలపించారు. ఇప్పుడీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇప్పటికే వైరల్ గా మారిన ‘నీ చుట్టూ చుట్టూ’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అప్ లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రామ్, శ్రీలీల ఎనర్జిటిక్ ఫర్ఫామెన్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ పాటను తెలుగులో మాత్రమే కాకుండా ‘మే పీచే పీచే’ పేరుతో హిందీలో, ‘ఒన్న సుతి సుతి’ పేరుతో తమిళంలో, ‘నిన్ సుత సుత’ పేరుతో కన్నడలో, ‘నీ తొట్టు తొట్టా’ పేరుతో మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి మూవీను నిర్మించారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com