SKN : తెలుగు హీరోయిన్లపై ఎస్కేఎన్ కామెంట్స్.. ఇందుకేనా..?

బేబీ సినిమాతో షైన్ అయిన నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు అలియాస్.. ఎస్కేఎన్. బేబీ నిర్మాతగా ఎస్కేఎన్ కు తిరుగులేని విజయాన్ని ఇచ్చింది. మరిన్ని సినిమాలు చేసేందుకు ఊతంగానూ కనిపించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే లేటెస్ట్ గా రిటర్న్స్ ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా వచ్చాడు ఎస్కేఎన్. ఆ టైమ్ లో వేదికపై అతను చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.
‘‘తెలుగు వచ్చిన అమ్మాయిలకన్నా.. తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తాం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతదో అర్థం అయింది. అందుకే ఇకనుంచి తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నా..’’ ఇదీ ఎస్కేఎన్ చెప్పిన మాట. దీంతో ఎవరి గురించి అతని కామెంట్ అంటూ ఆరాలు తీస్తున్నారు. అయితే ఇదంతా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే అంటున్నారు చాలామంది. ఎందుకంటే తను పనిచేసిన సినిమాలైనా, నిర్మించిన చిత్రాలైనా తెలుగు అమ్మాయిగా ఉంది వైష్ణవి మాత్రమే. అందుకే ఆమె గురించే ఈ కామెంట్స్ అంటున్నారు. మరి వీరి మధ్య ఎక్కడ చెడిందో కానీ.. ఇదే వేదికలో ఎస్కేఎన్ హీరోయిన్ కయాడు లోహర్ కు చేసిన ట్రాన్స్ లేషన్ చూస్తే అతనిలో మరో కోణం కూడా చూడొచ్చంటున్నారు.
హీరోయిన్ కయాడు.. తెలుగు రాకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతోంది. తెలుగు ప్రేక్షకుల కోసం అంటూ ఎస్కేఎన్ ట్రాన్స్ లేట్ చేస్తూ.. ‘మై తెలుగు ప్రేమికులారా.. మై తెలుగు బావలారా’అని అనిపించాడు ఆ హీరోయిన్ తో. నిజానికి ఆమెకు విషయం తెలియదు కాబట్టి అనేసింది. అదే బావలారా అని తెలుగు హీరోయిన్ ని అనమంటే అంటుందా..? ఖచ్చితంగా అనదు. ఒకవేళ తెలుగు హీరోయిన్ ఉంటే ఇలాంటి ‘వేషాలు’కుదరవనే ఎస్కేఎన్ అలా అన్నాడు అనేవారూ ఉన్నారు. ఏదేమైనా తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడమని చెప్పి.. హీరోయిన్ కు తెలుగువాళ్లను బావలూ అని పిలవమనడం ఏం సంస్కారమో ఆయనకే తెలియాలి.. ఇందుకేనా తెలుగు హీరోయిన్లను వద్దంటున్నావు.. అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com