NTR - Neel : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ.. ఆకాశమే హద్దట

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాసివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మూవీ డ్రాగన్. ఆర్ఆర్ఆర్, దేవర 1 తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో పాటు కేజీఎఫ్ 1,2 చిత్రాలతో కంట్రీ మొత్తాన్ని, సలార్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్థాయిలో చాలా బలమైన ఇంపాక్ట్ వేస్తాడు అనే అంచనాలు కూడా ఉన్నాయి. 1960ల కాలంలో బెంగాల్ లోని కొన్ని అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. పూర్తిగా పీరియాడిక్ సినిమానే ఉంటుందట. అంటే మళ్లీ ఈ కాలంలో కొంత పార్ట్ అంటూ ఉండదు. పూర్తిగా ఆ కాలంలోనే సాగుతుంది.
డ్రాగన్ లో మళయాలం నుంచి టోవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్. రవి బస్రూర్ సంగీతం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అప్డేట్స్ గురించి అడిగితే మైత్రీ మూవీస్ నిర్మాత రవి చెప్పిన మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ గ్యారెంటీ. ఎందుకంటే ఈ సినిమా గురించి ఎవరు ఎంతైన ఎక్స్ పెక్ట్ చేయొచ్చట. కానీ ఎంత ఎక్స్ పెక్ట్ చేసినా అంతకు మించిన హై ఉంటుందటున్నారు. ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకోవచ్చు.. అయినా అంతకు మించి ఇస్తాం అన్నాడు. అలాగే మూవీని చెప్పిన టైమ్( 2026 జనవరి 9) కే విడుదల చేసేలా ప్రయత్నిస్తున్నాం అన్నాడు. సో.. ఈ సినిమా చాలా రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం అని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారనుకోవచ్చు.
రీసెంట్ గానే చిత్రీకరణ ప్రారంభించుకుందీ మూవీ. ఫస్ట్ డే నే 2 వేల మంది ఆర్టిస్టులతో స్టార్ట్ చేశాడు ప్రశాంత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com