Skylab Trailer: ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. 'స్కైల్యాబ్' ట్రైలర్..

Skylab Trailer: సినిమా సీరియస్‌గా ఉంటే ఎవరు చూస్తారు.. థియేటర్‌లో కూర్చున్న ఆ రెండు గంటలు హాయిగా నవ్వుకోవాలి కానీ అని సినిమాకి వెళ్లే వాళ్లకి 'స్కైల్యాబ్' ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందేమో.. ట్రైలర్ చూస్తే అలానే ఉంది. విశ్వక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, నిత్యామీనన్ జంటగా నటించారు.
తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం శనివారం ఉదయం విడుదల చేసింది. ఇందులో సత్యదేవ్ వైద్యుడిగా, నిత్యామీనన్ విలేకరిగా కనిపించనున్నారు. కథకు అనుగుణంగా నటీనటుల వస్త్రధారణ ఉంది. లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి.
ఎంత పెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు.. గుర్తుపెట్టుకోండి అంటూ నిత్యా మీనన్ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒక వ్యాపారం ప్రారంభించాలంటే అన్నిటికంటే ముఖ్యమైంది డిమాండ్, సప్లయ్ అంటూ రాహుల్ రామకృష్ణకు సత్యదేవ్‌కు మధ్య వచ్చే డైలాగులు చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవచ్చు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి నిత్యా మీనన్ సహ నిర్మాత. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com