Aay : చిన్న సినిమాలు పెద్ద విజయాలు

కొన్నాళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ సరైన కమర్షియల్ హిట్ లేక కుదేలవుతోంది. అంచనాలున్న సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంటున్నాయి. ఈ మూడు నాలుగు నెలల కాలంలో కల్కి మాత్రమే సాలిడ్ హిట్ అనిపించుకుంది. మిగతావన్నీ పడుతూ లేస్తూ వస్తున్నాయి. అయితే ఆగస్ట్ నుంచి టాలీవుడ్ లో కొత్త జోష్ వస్తుందనుకున్నారు. బట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ రెండూ తుస్సుమన్నాయి. కాకపోతే సెకండ్ వీక్ లో వచ్చిన కమిటీ కుర్రాళ్లు కాస్త ఎక్కువగా ఆకట్టుకుంది.
ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా వచ్చిన సినిమాలు ఇరగదీస్తాయి అనుకుంటే డిజాస్టర్ అనిపించుకున్నాయి. ఉన్నంతలో పెద్దవాటిలో డబ్బింగ్ సినిమాగా వచ్చిన తంగలాన్ కు ఎక్కువ కలెక్షన్స్ ఉండటం విశేషం. ఈ విషయంలో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్ రెండూ విక్రమ్ తంగలాన్ కంటే వెనకబడి ఉన్నాయి. కాకపోతే తంగలాన్ కు థియేటర్స్ తక్కువగా ఉన్నాయి అంతే. అయితే అనూహ్యంగా ఆగస్ట్ 15న అందరి చేతా బలే ఉందండీ అనిపించుకున్న సినిమా ఆయ్.
నార్నే నితిన్, రాజ్ కుమార్, అంకిత్ ప్రధాన పాత్రల్లో నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సింపుల్ అండ్ బెస్ట్ ఎంటర్టైనర్ అనిపించుకుంటోంది. చాలా పరిమితమైన లొకేషన్స్ లో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది. అటు అంతకు ముందు వారం విడుదలైన కమిటీ కుర్రాళ్లు సైతం కమర్షియల్ గా వర్కవుట్ అయిపోయింది. ఈ మూవీ కూడా ఆయ్ లా యూనానిమస్ టాక్ తెచ్చుకునేదే. కానీ దర్శకుడు మరీ ఎక్కువ ఎలిమెంట్స్ టచ్ చేయడం.. ఏ ఎలిమెంట్ నూ చివరి వరకూ తీసుకువెళ్లపోవడంతో కాస్త వెనక బడింది కానీ.. ఈ ఆగస్ట్ లో బాక్సాఫీస్ కు కాస్త కళ తెచ్చిన సినిమాలంటే ఈ రెండు సినిమాలే అని చెప్పాలి.అటు విమర్శకులు సైతం ఈరెండు సినిమాలనే ఎక్కువగా పొగిడేశారు. ఇండస్ట్రీ వాళ్లే చిన్న చూపు చూస్తారు కానీ కంటెంట్ ఉంటే చాలు మాకు అనవసర హంగులేం లేకపోయినా ఫర్వాలేదు అనే పెద్ద మనసు ప్రేక్షకులది. మొత్తంగా పెద్ద సినిమాల మధ్య నలిగిపోతుందనుకున్న ఆయ్ అందరికంటే బెస్ట్ అనిపించుకుంటే.. పది చిన్న సినిమాలతో పోటీ పడి కంటెంట్ తో కంగ్రాట్స్ అనిపించుకున్న మూవీ కమిటీ కుర్రాళ్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com