Sneha: స్టైల్ మారింది.. డ్రెస్ మారింది.. దానికోసమే స్నేహ కొత్త లుక్..

Sneha (tv5news.in)
Sneha: ఒకప్పుడు తెలుగుతెరపై ఓ వెలుగు వెలిగి.. మెల్లగా కనుమరుగయిపోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు స్నేహ. అప్పట్లో ఏ ఎక్స్‌పోజింగ్ ఫ్యామిలీ కథా చిత్రాలలో నటిస్తూ స్నేహ అందరికీ దగ్గరయ్యింది. అప్పట్లో తన కాల్ షీట్లు కూడా అంత బిజీగా ఉండేవి మరి. అయితే పెళ్లి తర్వాత స్నేహ సినిమాలకు దూరంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాలో కనిపిస్తున్నా.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది.
మామూలుగా హీరోయిన్లంటే ఫోటోషూట్స్ కామన్. అలాగే స్నేహ కూడా ఈమధ్య ఫోటోషూట్‌లపై చాలానే దృష్టిపెడుతోంది. అందులోనూ మోడర్న్‌గా రెడీ అయ్యి స్నేహ పోస్ట్ చేస్తున్న ఫోటోలు తాజాగా బాగా వైరల్ అవుతున్నాయి. అటు ట్రెడీషినల్‌గా చీరకట్టులో కనిపిస్తూనే, ఇటు మోడర్న్‌గా సూపర్ అనిపించుకుంటోంది స్నేహ. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లకు పలు అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
స్నేహ ఫ్యాషన్ ఫోటోషూట్లు చూస్తుంటే తాను పూర్తిగా ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో ట్రెడిషీనల్‌గా ఉండే స్నేహ సరదాగానే ఇలాంటి ఫోటోలు పెడుతుందేమో అని మరికొందరు దీన్ని సింపుల్‌గా తీసుకుంటున్నారు కూడా.
స్నేహ సినీ కెరీర్ కూడా ప్రస్తుతం సాఫీగానే సాగుతోంది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి.. స్నేహ చివరి సినిమా అయినా తమిళంలో మాత్రం తను చాలా స్పీడ్‌గా దూసుకుపోతోంది. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏడాదికి కనీసం రెండు సినిమాలు అయినా చేస్తోంది స్నేహ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com