Naga Chaitanya : చైతూతో ఎంగేజ్‌మెంట్.. శోభిత అరుదైన ఘనత

నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. దీంతో ఆమె ఈ వారం IMDb ఇండియన్ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం సొంతం చేసుకున్నారు. ముంజ్యా, మహారాజ్ సినిమాలతో క్రేజ్ సాధించిన బాలీవుడ్ నటి శార్వరీ అగ్రస్థానంలో నిలిచారు. 3, 4, 5 స్థానాల్లో షారుఖ్, కాజోల్, జాన్వీ కపూర్ ఉన్నారు. ఇదిలాఉంటే.. కుటుంబ సభ్యుల సమక్షంలో గత గురువారం చైతు, శోభితల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ సడెన్ ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత మరింత హాట్ టాపిక్ గా మారారు. ఇకపోతే శోభిత, చైతన్యలు తమ రిలేషన్‌ను చాలా గోప్యంగా ఉంచారు. ఎక్కడా కూడా తమ బంధాన్ని బయటపెట్టలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com