Sobitha Dhulipala : మాతృత్వం అంటే చాలా ఇష్టం : శోభిత ధూళిపాళ్ల

అక్కినేని వారి కాబోయే కోడలు శోభిత ధూళిపాళ్ల పెళ్లి, సంతానంపై చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైతుతో ఎంగేజ్మెంట్, పెళ్లి అంశాన్ని ప్రస్తావించింది శోభిత. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తమ పెళ్లి జరుగుతుందని చెప్పింది. నిశ్చితార్థ వేడుక కోసం ఎన్నో కలలు, అంచనాలు, ప్లానింగ్స్ పెట్టుకొని ఆ క్షణం కోసం ఎదురుచూడలేదని, నేను ఆ క్షణాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించాను. చాలా సింపుల్, రిలాక్స్ డ్ గా స్వీట్ గా జరిగిందని తెలిపింది. అందమైన విషయాలు జరిగినప్పుడు ఎలాంటి అలంకారాలు అవసరం లేదని తాను భావిస్తానని చెప్పింది. తనకు మాతృత్వం అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఎప్పుడూ పెళ్లి చేసుకుని .. పిల్లలకు జన్మనిచ్చినట్లుగా ఊహించుకునేదాన్ని అని తెలిపింది. పెళ్లిలో తెలుగుతనం ఉట్టిపడాలని భావిస్తానని, ఎందుకంటే తన తల్లిదండ్రులు తెలుగు వాళ్లని చెప్పింది. సాధారణంగా తెలుగు పెళ్లిళ్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు పట్టు చీర కట్టుకుంటారని, తాను కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నానని చెప్పింది. ఇన్ని విషయాలు చెప్పిన శోభిత పెళ్లి తేదీని మాత్రం బయటపెట్టలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com