నాగ చైతన్యతో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన శోభిత ధూళిపాళ్ల

నాగ చైతన్యతో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన శోభిత ధూళిపాళ్ల
కాబోయే భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలను కూడా చెప్పుకొచ్చింది

పొన్నియన్ సెల్వన్ లో తళుక్కున మెరిసిన శోభితా ధూళిపాళ్ల జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. నాగచైత్యతో రిలేషన్ షిప్ పై వస్తున్న రూమర్లపై స్పష్టతను ఇచ్చింది. గత కొన్ని నెలలుగా నాగచైతన్యతో తన రిలేషన్ షిన్ పుకార్లపై వార్తల్లో నిలుస్తోంది శోధిత. ఇటీవల ఓ ఇంటర్వూలో తన రిలేషన్ షిప్ పై వచ్చిన పుకార్లపై స్పందించిన ఆవిడ... తన వ్యక్తిగత జీవితంపై కాకుండా తన పని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. దీంతోపాటే కాబోయే భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలను కూడా చెప్పుకొచ్చింది.


శోభిత నటించిన 'ది నైట్ మేనేజర్' పార్ట్ 2 విడుదలవుతున్న క్రమంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడింది. తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన రూమర్లపై బాధగా లేదని తెలిపింది. "ప్రేక్షకులు నా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం కంటే నా వృత్తి, నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడాలని కోరుతున్నాను. నేను వైజాగ్ నుంచి వచ్చాను, ప్రతీ క్షణం కష్టపడి పనిచేస్తున్నాను. అలాంటి నాకు, నా సినిమాల గురించి అడిగితే, చర్చించుకుంటే చాలా సంతోషిస్తాను" అని తెలిపింది.

తన వ్యక్తిగత జీవితం గురించి ప్రేక్షకులు మాట్లాడటం ఇష్టం లేదని అన్నారు శోభిత. అయితే వాళ్లు మాట్లాడిన మాటలు తనను తొందరగా బాధపెట్టలేవని చెప్పింది.

దీంతో పాటే.. తన జీవిత భాగస్వామికి కావలసిన లక్షణాలను చెప్పుకొచ్చింది. తాను నేల విడిచి సాము చేయలేనని తెలిపింది. జీవితం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తే తన భర్తగా లభిస్తాడని ధీమా వ్యక్తం చేసింది. జీవితం చాలా చిన్నదని అందులో ప్రతీ క్షణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునే వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story