Sobhita : ఇంగ్లీష్ టు తెలుగు ... శోభితా ధూళిపా వీడియో వైరల్

Sobhita : ఇంగ్లీష్ టు తెలుగు ... శోభితా ధూళిపా వీడియో వైరల్
X

అక్కినేని వారింటికి కాబోయే కోడలు శోభితా ధూళిపాళ్లపై నెట్టింట రకరకాల చర్చలు మొదలయ్యాయి. గుఢచారి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది శోభిత. అంతకు ముందు మోడల్ గా రాణించింది. అలాగే పలు యాడ్స్లోనూ నటిచింది. హిందీలో మూడు సినిమాలు చేసిన తర్వాత తెలుగులో అవకాశం అందుకుంది. అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్ టైంలో చిత్ర యూనిట్ ను , మహేశ్ బాబు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో శోభితపై మహేశ్ సెటైర్లు కూడా వేశారు. శోభితను తన జర్నీ గురించి చెప్పమంటే ఈ అమ్మడు ఇంగ్లిష్ మొదలు పెట్టింది.

దీంతో మైకందుకున్న మహేశ్.. తెలుగులో మాట్లాడవా ప్లీజ్.. కుదిరితే నీ యాసలో మాట్లాడు.. అన్నాడు. దీంతో శోభిత తెనాలి నుంచి ముంబై వరకు సాగిన జర్నీ అంతా చెప్పేసింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న విషయాన్ని చెప్పేసింది. అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది


Tags

Next Story