Sobhita : శోభిత ఆస్తి రూ.10కోట్లు!

అక్కినేని నాగచైతన్య వుడ్ బీ శోభితా ధూళిపాళ్ల బాగానే సంపాదించిందట. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించిన శోభిత బాగానే సంపాదించింది. ఇప్పటి వరకు 12 సినిమాల్లో నటించింది. హింది, తెలుగు, మళయాలం, ఇంగ్లిష్ సినిమాల్లో నటించింది. ఏపీలోని తెనాలి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శోభిత విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. శోభిత ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్ కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ తీసుకుంది. హీరోయిన్ శోభితకు మొత్తం 7–10 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉంటుందట. ఇది కేవలం ఈ నటి సంపాదించింది మాత్రమే. ఇంకా తల్లిదండ్రులు సంపాదించింది వేరే ఉందట. కానీ 150 కోట్ల
రూపాయల ఆస్తిపాస్తులున్నా అక్కినేని ఫ్యామిలీ.. శోభిత కుటుంబం నుంచి ఎలాంటి కట్న కానుకలు ఆశించడం లేదని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది. అక్కినేని ఇంటికి కోడలిగా పంపేందుకు శోభితా ఫ్యామిలీ చాలా గర్వంగా ఫీల్ అవుతుందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com