Naga Chaitanya - Sobhita : మ్యారేజ్ ఆఫ్ ద ఇయర్ గా శోభిత పెళ్లి ..

Naga Chaitanya - Sobhita :  మ్యారేజ్ ఆఫ్ ద ఇయర్ గా శోభిత పెళ్లి ..

శోభిత ధూళిపాల.. త్వరలోనే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఆల్రెడీ చైతూ.. సమంతను పెళ్లి చేసుకుని నాలుగేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకున్నాడు. పెద్దగా గ్యాప్ లేకుండానే మరో పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే ఇప్పుడు మనం చూడబోయేది శోభిత, చైతన్య పెళ్లి మేటర్ కాదు. ఓన్లీ శోభిత పెళ్లి గురించి.

శోభిత పెళ్లి తర్వాత కూడా నటిస్తుందని ముందే చెప్పింది. ఆ క్రమంలో ఆల్రెడీ చేసిన సినిమాలు కూడా వరుసగా విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తను జి5 ఒరిజినల్ కు చేసిన ‘లవ్ సితార’ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తే ఒంటరి తనం ఫీలయ్యే వాళ్లే పెళ్లి చేసుకుంటారని ఫ్రెండ్స్ కు చెప్పిన అమ్మాయి తను పెళ్లికి రెడీ అవుతుంది. సౌత్ కు చెందిన తను నార్త్ కు చెందిన ఒక చెఫ్ తో ప్రేమలో పడుతుంది. కుటుంబాలూ ఒప్పుకుంటాయి. ఇక పెళ్లే అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందా అని లవర్ తో చెబుతుంది శోభిత.. అందుకు దారి తీసిన కారణాలు కూడా ట్రైలర్ లో ఉన్నాయి. పార్టనర్స్ లైఫ్ లో తాము కాకుండా వేరే సీక్రెట్స్ ఉంటే ఆ బంధం గొప్పగా నిలవదు అనే పాయింట్ తో పాటు సంస్కృతి, సంప్రదాయాల గురించిన డిస్కషన్స్ కూడా ఉన్నట్టున్నాయి. ట్రైలర్ బావుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లోనే ఇది ‘మ్యారేజ్ ఆఫ్ ద ఇయర్’ అనే ట్యాగ్ కనిపిస్తోంది. అలాంటి పెళ్లి కూడా పీటలపైకి ఎక్కక ముందే అనేక మనస్ఫర్థలు వస్తాయి. సో.. ఈ నెల 27 నుంచి స్ట్రీమ్ కాబోతోన్న ఈ లవ్ సితార ఎలా ఉంటుందో కానీ.. అక్కినేని వారి కాబోయే కోడలు హాట్ నెస్ మాత్రం తగ్గించలేదు అనే చెప్పాలి.



Tags

Next Story