Telusu Kada Movie : ఓ.జి ఫీవర్ లో వినిపించని తమన్ మెలోడీ

టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఓ.జి చిత్రానికి తన కెరీర్ లో ఎప్పుడూ ఇవ్వనంత డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడని పాటలు, ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ మూవీకి అతనే బ్యాక్ బోన్ అని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పాడంటే మనోడు ఏ రేంజ్ లో ఇరగదీసి ఉంటాడో ఊహించొచ్చు. అయితే ఈ సౌండింగ్ లో అతని ఓ బ్యూటీఫుల్ మెలోడీ మరుగున పడిపోవడం ఊహించి ఉండరు.
నీరజా కోన దర్శకురాలుగా పరిచయం అవుతూ రూపొందిస్తోన్న మూవీ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ ఇది. అక్టోబర్ 17న వాల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుంచి తాజాగా ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు. బట్ ఓ.జి ఫీవర్ వల్ల ఈ పాటను పెద్దగా పట్టించుకోలేదెవరూ. కృష్ణ కాంత్ రాసిన ఈ గీతాన్ని కార్తీక్, అద్వితీయ వొజ్జల కలిసి పాడారు. ఈ మధ్య ఏ పాట విడుదల చేసినా తమన్ తనదైన స్టైల్లో కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు. తనే ఆ పాటలో కనిపిస్తున్నాడు. కానీ ఈ పాటలో మాత్రం సింగర్స్ ను కొత్తగా చూపించాడు. వాళ్లిద్దరూ బస్సులోనో, కాఫీ షాప్ లోనో ఉన్నట్టుగా వీడియోస్ చేయించి సినిమాకూ ప్రమోషన్ చేశాడు. ఇలా చేయడం ఫస్ట్ టైమ్ అనిపించేలా కొత్తగా ఉంది ఇదంతా.
కృష్ణ కాంత్ ఈ మధ్య ప్రేమగీతాలను చాలా కొత్తగా రాస్తున్నాడు. సింపుల్ వర్డ్స్ తో గొప్ప భావాలను పలికిస్తున్నాడు. ఈ పాటలోనూ అలాంటి భావనలు చాలానే ఉన్నాయి. ‘ఎప్పుడు ఇలా లేదుగా మరి కొత్తగా.. కలలు కలిసిరాగా.. ఉప్పెనే అమాయకంగా అమ్మాయిలాగా.. ఎదురు పడుతు రాగా.., ‘సమయమాపగలమా ప్రేమతో సులువు.. కాదులేమ్మ కౌగిలై ఖాళీ నింపుధామా’వంటి ప్రయోగాత్మక సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా విన్నా కొద్దీ వినాలనిపించేలా ఉన్న ఈ మెలోడీ ఓ.జి మాటున ఆగిపోయింది అని చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com