Sohail Khan_Seema Khan : బాలీవుడ్ లో విడిపోతున్న మరో జంట..!

Sohail Khan_Seema Khan : సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. 1998లో సీమా ఖాన్ ని ప్రేమించి పారిపోయి మరి చేసుకున్నాడు సోహైల్.. ఎంతో అన్యోనంగా ఉండే ఈ జంట 24 ఏళ్ల తర్వాత విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.. గతకొంతకాలంగా దూరంగా ఉంటున్న వీరిద్దరూ మే 13 న శుక్రవారం ముంబై లోని ఫ్యామిలీ కోర్టుకు వచ్చి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నారో కారణాలు మాత్రం తెలియలేదు. కాగా సోహైల్, సీమా ఖాన్ కి నిర్వాన్, యోహాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. 2000లో వీరికి మొదటి సంతానంగా నిర్వాన్ ఖాన్ జన్మించగా, 2011లో, ఈ జంటకి రెండవ కుమారుడిగా యోహాన్ జన్మించాడు. అటు గతంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నరంటూ వార్తలు రాగా వాటిని సీమా ఖండిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com