Court Movie : కొనసాగుతోన్న కోర్ట్ దండయాత్ర

Court Movie :  కొనసాగుతోన్న కోర్ట్ దండయాత్ర
X

ప్రేక్షకులకు సినిమా నచ్చితే దాన్ని ఏ రేంజ్ కు తీసుకువెళతారు అనేందుకు ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కోర్ట్ మూవీ. చాలా చిన్న మూవీగా కంటెంట్ బేస్డ్ కథతో వచ్చిన కోర్ట్ కలెక్షన్స్ విషయంలో వాయిదాలే లేకుండా దూసుకుపోతోంది. రిలీజ్ డే కి రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ ప్రీమియర్స్ కు మంచి టాక్ వచ్చింది. ఇక 14 తేదీ నుంచి కలెక్షన్స్ తో పాటు కంటెంట్ కు ప్రశంసలు కూడా అదనంగా వస్తున్నాయి. ఈ కారణంగానే యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడ్డానికి ఎగబడుతున్నారు.

నాని నిర్మించాడు అనేది ఫస్ట్ లేయర్ గానే ఉన్నా.. బలమైన కంటెంట్ ఈ మూవీకి మెయిన్ హైలెట్. కోర్ట్ రూమ్ డ్రామా అనగానే కనిపించే ఓవర్ యాక్షన్స్ ఏం లేకుండా.. సింపుల్ గా, ఒరిజినాలిటీకి కాస్త దగ్గరగా ఉండటంతో మరింత ఆకట్టుకుంటోంది. కొన్ని మైనస్ లు ఉన్నా.. సెకండ్ హాఫ్ లో వచ్చిన బలమైన వాదోపవాదాలు, ఎమోషన్స్, చట్టం గురించిన చర్చలు 16 నిమిషాల ఎపిసోడ్ పై కొనసాగిన ఉత్కంఠ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశాయి. అందుకే వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తోంది.

5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 33.55 కోట్లు వసూళ్లు సాధించి సిసలైన బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి, రోహిణి, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ మరో హైలెట్ గా కనిపిస్తోంది. చూస్తుంటే ఈ కలెక్షన్స్ తో ఈజీగా 50 కోట్ల మార్క్ ను టచ్ చేసేలా ఉంది కోర్ట్.

Tags

Next Story