Vijay Devarakonda : విజయ్ దేవరకొండ లైనప్ లో ఛేంజెస్

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ లైనప్ లో ఛేంజెస్
X

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దూకుడుగా ఉన్నాడు. లాస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ పోయినా అతని రేంజ్,క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శ్రీలంకలో సాగుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి రెండు స్టిల్స్ లీక్ అయ్యాయి. అవేమంత డ్యామేజింగ్ గా లేవు కానీ సినిమాకు ఊహించని ప్రమోషన్ గా పనిచేశాయి. సితార ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ మూవీ తర్వాత రాజావారు రాణివారు ఫేమ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే రూరల్ డ్రామా అన్నారు. ఈ మేరకు దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి రాయలసీమలో ఆ యాస మాట్లాడేవారిని ఆడిషన్స్ కూడా చేస్తున్నాడు. ఈ టైమ్ లో సడెన్ గా ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది అనే న్యూస్ రావడం విశేషం.

రవి కిరణ్ కోలా తర్వాత విజయ్.. రాహుల్ సాంకృత్యన్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. అది పీరియాడికల్ యాక్షన్ డ్రామా. అయితే ఇప్పుడు రాహుల్ సినిమాను ముందుగా చేయాలనుకుంటున్నాడట. రాహుల్ తో ఆల్రెడీ టాక్సీవాలా చేశాడు విజయ్. తర్వాత రాహుల్ నానితో చేసిన శ్యామ్ సింగరాయ్ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ పీరియాడికల్ డ్రామా. మరి ఈ కథలో ఎక్కువ టెంప్టింగ్ అంశాలుండటంతో ముందుకు వచ్చిందా లేక రవి కిరణ్ కోలా కు ఇంకా టైమ్ పడుతుందని ముందుకు వచ్చిందా అనేది తెలియదు కానీ.. ఈ లైనప్ లో మాత్రం మార్పులు వచ్చాయి.

Tags

Next Story