Somy Ali: నేను పదిహేనేళ్ల వయసులో డ్రగ్స్ ట్రై చేసాను: సోమీ అలీ

Somy Ali: బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. ఒక రేవ్ పార్టీకి వెళ్లిన ఆర్యన్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ పార్టీలో డ్రగ్స్ సప్లైకి సంబంధించి ఆర్యన్ తన వాదన తాను చెప్పుకున్నాడు. ఆర్యన్ విషయంలో షారూఖ్ ఖాన్‌కు బాలీవుడ్ ప్రముఖులంతా తనకు మద్దతునిస్తున్నారు. తాజాగా నటి, సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమి అలీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
'టీనేజర్లు డ్రగ్స్ ట్రై చేయాలనుకోవడం తప్పేమీ కాదు. అతడు అంతకంటే పెద్ద నేరం ఏం చేయలేదు కదా.. తనను వదిలేయండి. మనం ఎంత ప్రయత్నించినా డ్రగ్స్, వ్యభిచారం అనే వాటిని దూరం చేయలేం. అందుకే ఈ రెండిటిని నేరంగా పరిగణించకూడదు. ఇక్కడ ఎవరూ సాధువులు కాదు. నేను పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు 'ఆందోళన్' సినిమా చేస్తున్నప్పుడు దివ్య భారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేసాను' అని చెప్పుకొచ్చింది.
మన వ్యవస్థ ఆర్యన్ లాంటి పిల్లాడిని పట్టుకొని తప్పును రైట్ అని ప్రూవ్ చేయాలనుకుంటుంది. దాని బదులు రేపిస్ట్‌లు, హంతకులపై దృష్టిపెడితే మంచిదని సోమి అలీ ఖాన్ చెప్పింది. 1971 నుండి అమెరికా కూడా డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటికీ ఆ దేశంలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతాయి. ఆర్యన్ ఏ తప్పు చేయలేదని, షారూఖ్, గౌరీకి నేను మద్దతునిస్తున్నానని పోస్ట్ చేసింది సోమీ అలీ. ప్రస్తుతం ఈ పోస్ట్ అంతటా వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com