'సన్ ఆఫ్ ఇండియా' లిరికల్ సాంగ్ రిలీజ్..

సన్ ఆఫ్ ఇండియా లిరికల్ సాంగ్ రిలీజ్..
మోహన్ బాబు.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకీ ఓ చరిత్ర ఉంది. స్వయంకృషితో నటుడుగా ఎదిగి.. విలన్ గానే విజిల్స్ వేయించుకుని.. హీరోగా బాక్సాఫీస్ ను షేక్ చేసి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు.

మోహన్ బాబు.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకీ ఓ చరిత్ర ఉంది. స్వయంకృషితో నటుడుగా ఎదిగి.. విలన్ గానే విజిల్స్ వేయించుకుని.. హీరోగా బాక్సాఫీస్ ను షేక్ చేసి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. 90వ దశకంలో మోహన్ బాబు సినిమా అంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించుకున్నాడు. అలా 1995 జూన్ 15నే తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన పెదరాయుడు విడుదలైంది. ఇప్పుడు అదే రోజున ఆయన నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' నుంచి ఓ అద్భుతమైన పాటను ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

నటుడుగా మోహన్ బాబు ప్రతిభ శిఖరమంత. ఆయన చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు తన సమకాలీకుల్లో మరెవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఇక వాచకం గురించి మాట్లాడితే ఆయన గొంతే ఓ గళాశాల. నటుడుగా నిర్మాతగా తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలెన్నో. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం చూస్తోన్న ఈ కలెక్షన్ కింగ్ ఈ సారి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ.. అనేలా 'సన్ ఆఫ్ ఇండియా'తో వస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా చిరంజీవి వాయిస్ ఓవర్ తో విడుదల చేసిన టీజర్ వెరీ ఇంప్రెసివ్ గా ఉంది.

కరెక్ట్ కథ పడితే మోహన్ బాబు లాంటి నటుడు ఆ కథను ఏ స్థాయికి తీసుకువెళతాడో కొత్తగా చెప్పక్కర్లేదు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో వస్తోన్న ఈ సన్ ఆఫ్ ఇండియా కూడా అలాంటి కథతోనే వస్తున్నట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. నేను వెలుగులో ఉండే చీకటిని.. చీకట్లో ఉండే వెలుగుని వంటి డైలాగ్స్ సినిమాలో విజిల్స్ వేయించడం గ్యారెంటీ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.

ఇక 11వ శతాబ్దంలో వేదాంత దేశికుల వారు శ్రీరాముని పరిపాలనను కీర్తిస్తూ రాసిన శ్రీ రఘువీర గద్యం పద్యాన్ని 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా కోసం వాడారు మోహన్ బాబు. ఈ రోజు విడుదలైన ఆ పాట ప్రోమో వీనుల విందుగా ఉంది. ఈ పాట సంగీత ప్రియులను ఓ రకమైన ఆధ్యాత్మిక భావనలోకి తీసుకెళుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే సంస్కృత సమాహారాలు, క్లిష్టమైన పదకోశాలతో మిళితమైన ఈ పద్యాన్ని కంపోజ్ చేయడానికి ఇళయరాజా సైతం కొంత ఇబ్బందిగా ఫీలయ్యారు. మొత్తంగా ఆయన తరహా మార్కుతో అద్భుతమైన కంపోజింగ్ చేసి ఈ పద్యాన్ని పాటగా మలిచారు. రాహుల్ నంబియార్ గాత్రంలో 'జయజయ మహావీర మహాధీర' అంటూ సాగే ఈ పాట మాదిరిగానే ఈ చిత్రం కూడా అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..

Tags

Read MoreRead Less
Next Story