Sonakshi Sinha: సోనాక్షిపై ఛీటింగ్ కేసు.. స్పందించిన నటి..

Sonakshi Sinha (tv5news.in)

Sonakshi Sinha (tv5news.in)

Sonakshi Sinha: ఈ కేసు మురాదాబాద్ కోర్టు నుండి అలహాబాద్ కోర్టుకు వెళ్లింది.

Sonakshi Sinha: మామూలుగా నటీనటులపై పలు విషయాల్లో కేసులు నమోదు అవుతూ ఉంటాయి. అందులో కొంతవరకే నిజాలు ఉన్నా.. చాలావరకు ఆ నటీనటుల గుర్తింపును చెడగొట్టడానికే ఉంటాయి. అయితే తాజాగా బాలీవుడ్ నటిపై కూడా ఓ ఛీటింగ్ కేసు నమోదు అయ్యిందని, అందులోనూ అది నాన్ బెయిలబుల్ కేసు అని కథనాలు వ్యాపించాయి. దీనిపై నటి తొలిసారి స్పందించింది.


యూపీకి చెందిన ఈవెంట్‌ నిర్వాహకుడు ప్రమోద్‌ శర్మ తాను ఆర్గనైజ్ చేస్తున్న ఓ ఈవెంట్‌కు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడట. దానికోసం రూ. 37లక్షలు అడ్వాన్స్‌గా కూడా చెల్లించాడట. అయితే సోనాక్షి ఈవెంట్‌కు హాజరు కాలేదని సమాచారం. దీని గురించి అడగడానికి సోనాక్షి మేనేజర్‌కు ఫోన్ చేసినా.. డైరెక్ట్‌గా సోనాక్షినే కాంటాక్ట్ అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోనాక్షిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. అయితే సోనాక్షి ఈ ఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చింది.


'నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని ఏ స్పష్టత లేకుండా కొన్నిరోజుల నుండి మీడియాలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా అబద్ధం. నన్ను వేధించాలనుకుంటున్న ఓ రోగ్ చేసిన పని ఇదంతా. నా పేరు ఉపయోగించుకొని గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న ఆ వ్యక్తి గురించి ప్రచారం చేస్తూ.. ఈ వార్తను ముందుకు తీసుకెళ్లొద్దని నేను మీడియా వారిని కోరుకుంటున్నారు'.

'నేను ఏళ్లుగా సంపాదించుకున్న పేరును పాడుచేయాలని, నా దగ్గర నుండి డబ్బులు తీసుకొని గుర్తింపు సంపాదించుకోవాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. అందుకే మీడియా వారు ఈ కథనాలు ప్రచురించి అతడికి సహాయపడకండి. ఈ కేసు మురాదాబాద్ కోర్టు నుండి అలహాబాద్ కోర్టుకు వెళ్లింది. మురాదాబాద్ కోర్టు నుండి తీర్పు వచ్చేవరకు నేను ఈ విషయంపై ఇంకేం స్పందించను'. అని సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.



Tags

Read MoreRead Less
Next Story