Sonal Chauhan: 'తెలుగు సినిమాలు గ్రేట్..' బాలీవుడ్ బ్యూటీ ప్రశంసలు..

Sonal Chauhan: ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో ఏ భాష సినిమాలు గొప్ప అనే వివాదం నడుస్తోంది. దీనికి ముఖ్య కారణం బాలీవుడ్ సినిమా సరైన ప్రేక్షకాదరణ సాధించకపోవడమే. అంతే కాకుండా సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్‌లో సత్తా చాటడంతో చాలామంది బాలీవుడ్ హీరోలు ఫస్ట్రేషన్‌లో ఎన్నో మాటలు అన్నారు కూడా. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ మాత్రం రివర్స్‌లో తెలుగు సినిమాలే గ్రేట్ అంటోంది.
బాలకృష్ణలాంటి సీనియర్ హీరోతో నటించి టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది సోనాల్ చౌహాన్. తను తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా ఇప్పటికీ తనను బాలయ్య హీరోయిన్‌గానే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. త్వరలోనే అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్ 3' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది సోనాల్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ టాలీవుడ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సోనాల్.
తెలుగు పరిశ్రమలో డైరెక్టర్లు, నిర్మాతలు చాలా క్లారిటీతో ఉంటారని చెప్పింది సోనాల్. కొత్తగా ఆలోచించి ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారని తెలిపింది. అందుకే తెలుగులో గొప్ప సినిమాలు వస్తున్నాయని, తెలుగు సినీ పరిశ్రమ గురించి ఇప్పుడు దేశం అంతా గొప్పగా మాట్లాడుకుంటుందంది సోనాల్. అంతే కాకుండా ఎఫ్ 3లో తన క్యారెక్టర్ ఒక సర్‌ప్రైజ్ అంటోంది ఈ భామ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com