Sonal Chauhan : సోనాల్ కొత్తదారి వెతుక్కుందా?

Sonal Chauhan : సోనాల్ కొత్తదారి వెతుక్కుందా?
X

ఆదిపురుష్ సినిమాలో అతిథిపాత్రలో మెరిసిన ముద్దుగుమ్మ సోనాల్ సింగ్ చౌహాన్. ఈ యూపీ బ్యూటీకి ఇండియాలో అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు ఆమె చూపంతా బంగ్లాదేశ్ పై పడింది. బంగ్లాదేశ్ కి చెందిన ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ దర్ట్లో అవకాశం దక్కించుకుంది. షకీబ్ ఖాన్ కి డాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ ఉంది. అతడి సరసన ఆఫర్ అనగానే బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ ఓకే చెప్పేసిందట. దీంతో అటు బంగ్లాదేశ్, ఇండియాలోను ఈ అమ్మడి పేరు మారుమోగడం

ఖాయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ నడుస్తోంది. అటు బాలీవుడ్ లో సినిమాకు ఓకే చెప్పిన సోనాల్ .. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా మారింది. ఇటు వైపు మరో గాలం వేస్తోంది. తన అందచందాలతో కుర్రకారులో హీట్ పెంచుతోంది. ఆమె షేర్ చేసిన ఫొటోలను చూసిన వారు కామెంట్ల మోత మోగిస్తున్నారు.

Tags

Next Story