Sonarika Bhadoria: బాలీవుడ్ నటికి రూ. 70 లక్షలు లాస్.. ఆ సీరియల్ వల్లే..

Sonarika Bhadoria (tv5news.in)
Sonarika Bhadoria: సినిమాల్లో, సీరియల్‌లో నటించే వారికి ఏ లోటు ఉండదని, వారికి ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్ చేతికి వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలామంది నటీనటులు అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల అలాంటి ఒక చేదు అనుభవాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకుంది సోనారిక బడోరియా.
సోనారిక బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సోనారిక మెల్లగా బాలీవుడ్ సీరియల్స్‌లో నటిగా తనదైన ముద్ర వేసుకుంది. 'దేవో కీ దేవ్ మహాదేవ్' సీరియల్‌లో పార్వతిగా తాను చేసిన పాత్ర ఇప్పటికీ తనను అందరూ గుర్తుపట్టేలా చేసింది. దాని తర్వాత 'దస్తాన్ ఏ మొహబ్బత్: సలీం అనార్కలీ' అనే సీరియల్‌లో కూడా నటించింది. అయితే ఈ సీరియల్ వల్ల తాను ఎదుర్కున్న చేదు అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టింది సోనారిక.
'దస్తాన్ ఏ మొహబ్బత్' సీరియల్ 2018 నుండి 2019 మధ్యలో టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ సీరియల్ పూర్తయ్యి మూడేళ్లు అయినా కూడా యాజమాన్యం తనకు రావాల్సిన రూ.70 లక్షల పారితోషికం ఇంకా ఇవ్వలేదని బహిరంగంగా వెల్లడించింది సోనారిక. తనకు మాత్రమే కాకుండా ఆ సీరియల్‌లో పనిచేసే పలువురు టెక్నిషియన్లకు కూడా వారు ఇంకా పేమెంట్ అందించలేదని చెప్పింది. కరోనా సమయంలో కూడా పేమెంట్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపింది సోనారిక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com