Lata Mangeshkar: లతా మంగేష్కర్‌కు నాగార్జున ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే..

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌కు నాగార్జున ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే..
Lata Mangeshkar: అయితే ఇన్ని వేల పాటలు పాడిన లతా మంగేష్కర్.. తెలుగులో పాడింది మాత్రం మూడు పాటలే.

Lata Mangeshkar: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 73 ఏళ్ల పాటు పాటలు పాడారు లతా మంగేష్కర్. బహుశా మరెవరికీ ఇది సాధ్యంకాని రికార్డే. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘకాలం పాటలు పాడిన గాయని మరొకరు లేరు. 1942 నుంచి 2015 దాకా అవిశ్రాంతంగా పాటలు పాడుతూనే ఉన్నారు. అయితే ఓ పాట విషయంలో లతా మంగేష్కర్‌కు ఓ తెలుగు హీరో ఎప్పటికీ రుణపడాల్సిందే అని ఆమె అభిమానులు అంటున్నారు.

గాయనిల్లో భారతరత్న అందుకున్న రెండో వ్యక్తి లతా మంగేష్కరే. ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి తరువాత లతాకు మాత్రమే భారతరత్న పురస్కారం దక్కింది. 50వేల పాటలు పాడడం అంటే మాటలు కాదు. ఆమె స్వరరాగ ప్రవాహాన్ని చూసి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డే తలవంచింది.

తన గానంతో లతా మంగేష్కర్ ఖ్యాతి హిమాలయ శిఖరాగ్రానికి చేరినా సరే.. ఆమె వ్యక్తిత్వం మాత్రం ఎంతో ఆదర్శవంతంగా ఉండేది. రాజ్యసభ ఎంపీగా ఉన్నంతకాలం కేవలం ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకున్నారు.

అయితే ఇన్ని వేల పాటలు పాడిన లతా మంగేష్కర్.. తెలుగులో పాడింది మాత్రం మూడు పాటలే. అందులో ఒకటి ఎన్‌టీఆర్, మరొకటి ఏఎన్నార్, ఇంకొకటి నాగార్జున నటించిన చిత్రాల్లో పాడారు. అయితే ఇప్పుడున్న హీరోల్లో లతా మంగేష్కర్‌తో పాట పాడించిన క్రెడిట్ కేవలం నాగార్జునకే దక్కింది.

1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం 'ఆఖరి పోరాటం'. ఈ సినిమాలో లతా మంగేష్కర్ ఎలాగైనా పాట పాడాలని పట్టుపట్టిన నాగార్జున.. చివరికి సాధించారు. ఆఖరి పోరాటం చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ కలిసి పాడిన 'తెల్లచీరను' పాట ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. అంతే కాకుండా నాగార్జున కెరీర్‌లో ఎన్ని పాటలు వచ్చినా.. ఇది మాత్రం ఎప్పటికీ స్పెషల్ అనుకుంటున్నారు లతా మంగేష్కర్ అభిమానులు.

Tags

Read MoreRead Less
Next Story