Sonia Agarwal: రెండో పెళ్లికి సిద్ధమయిన నటి.. ఈసారి కూడా దర్శకుడితోనే..

Sonia Agarwal (tv5news.in)
Sonia Agarwal: ఒకే సినిమా చేసి.. దానితోనే స్టార్‌డమ్ తెచ్చుకుని ఆ తర్వాత కనుమరుగయిపోయిన నటీమణులను ఎందరినో మనం చూశాం. అలాంటి వారిలో ఒకరే సోనియా అగర్వాల్. తన పేరు చెప్పగానే చాలామంది టక్కున గుర్తుపట్టకపోవచ్చు. కానీ 7జీ బృందావన్ కాలనీ హీరోయిన్ అనగానే గుర్తుపట్టేస్తారు. చాలారోజులుగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటున్న ఈ నటి గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.
సోనియా అగర్వాల్ 7జీ బృందావన్ కాలనీ సినిమా ద్వారానే హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ సినిమా వచ్చి చాలాకాలమే అయినా ఇప్పటికీ ఇది చాలామందికి ఫేవరెట్. అందుకే ఆ ఒక్క సినిమాలోనే నటించినా కూడా సోనియా అగర్వాల్‌కు చాలానే క్రేజ్ వచ్చింది. ఆ తరువాత పలు తమిళ, కన్నడ చిత్రాలలో నటించిన సోనియా.. తన కెరీర్‌కు చాలా తొందరగానే ఫుల్ స్టాప్ పెట్టింది.
తనను హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం చేసిన సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడిన సోనియా.. తనను 2006లో పెళ్లి చేసుకుంది. కానీ చాలావరకు ఇతర సెలబ్రిటీ జంటలలాగానే వీరి జంట కూడా ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. పెళ్లయిన నాలుగేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సోనియా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులాగా సెటిల్ అయిపోయింది.
తాజాగా సోనియా అగర్వాల్ వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త వైరల్‌గా మారింది. ఇదివరకే దర్శకుడు సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకుని విడిపోయిన సోనియా.. మరోసారి మరో దర్శకుడితో ప్రేమలో పడిందని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా సోనియా.. త్వరలో ఆ దర్శకుడిని పెళ్లి కూడా చేసుకోనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. సోనియాపై ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. కానీ ఈసారైనా అవి నిజమవుతాయా తెలియాలంటే సోనియానే ఓ క్లారిటీ ఇవ్వాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com