Viswak Sen : సోనూ మోడల్.. కంట్రీలో ఈ బ్రీడ్ లేదు

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'లైలా'. సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా లైలా నుంచి సోనూ మోడల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమో చూడగానే.. చాలామంది.. ఇది మంచి మాస్ నంబర్ అవుతుందని.. సెలబ్రేషన్ సాంగ్ అవుతుందనుకున్నారు.ఈ న్యూ ఇయర్ సందర్భంగా పాట విడుదల చేశారు. అనుకున్నట్టుగానే అలాగే ఉందీ సాంగ్.
హీరో క్యారెక్టరైజేషన్ ను తెలియజేస్తూ సాగే ఈ గీతాన్ని విశ్వక్ సేనే రాయడం విశేషం. లియాన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు. నారాయణన్ రవిశంకర్, రేష్మ శ్యామ్ కలిసి పాడారు. 'విజిలు విజిలు నువ్వు కొడతాం విజిలు.. పగులు పగులు ప్రతీ సెంటర్ పగులు.. తిరుగు తిరుగు మీ దిమ్మల్ తిరుగు.. చిన్న పెద్ద తేడా లేదు.. మంచోడే పిల్లోడే సోగ్గాడే.. ఫుల్లు కంట్రీలో లేదమ్మా ఈ బ్రీడసలు..'అంటూ సాగుతుందీ గీతం. కలర్ ఫుల్ ఫ్రేమ్స్ తో మంచి డ్యాన్స్ నంబర్ లానూ కనిపిస్తోంది. పాట సినిమాలో కీలకం అనేలా ఉంది. మాస్ బాగా నచ్చేలా సోనూ మాడల్, మాడల్ మాడల్ సోనూ మాడల్ అంటూ వినిపించే హూక్ లైన్స్ ఆకట్టుకుంటున్నాయి.
విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com