Sonu Nigam : స్టార్ సింగర్ ను అవమానించిన సి.ఎమ్

Sonu Nigam :  స్టార్ సింగర్ ను అవమానించిన సి.ఎమ్
X

పొలిటీషియన్స్, సినిమా వాళ్ల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. వీరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉంటాయి. కొందరు వ్యక్తిగత సంబంధాలు కూడా కలిగి ఉంటారు. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ ఎమ్.పిని పెళ్లి చేసుకుంది కదా.. అలా. అయితే తాజాగా రాజస్తాన్ లో జరిగిన ఓ ఈవెంట్ లో తమను అక్కడి ముఖ్యమంత్రితో సహా ఇతర రాజకీయ నాయకులు అవమానించారు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు ప్రముఖ సింగర్ సోనూ నిగమ్. సోనూ నిగమ్ తెలుగులోనూ అనేక పాటలు పాడాడు. ప్రస్తుతం దేశంలోని ది బెస్ట్ సింగర్స్ లో ఫస్ట్ రో లో ఉండే సింగర్ ఈయన. అలాంటి సింగర్ తనకు అవమానం అని ఫీలవుతూ చెప్పాడంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది అనిపిస్తుంది కదా. ఇంతకీ విషయం ఏంటంటే...

రీసెంట్ గా సోనూ నిగమ్ ‘రైజింగ్ రాజస్తాన్’ అనే ఈవెంట్ కు సింగర్ గా వెళ్లాడు. ఆ కార్యక్రమానికి అక్కడి ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో పాటు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి పెద్ద పెద్ద నాయకులు అటెండ్ అయ్యారట. అయితే తను పాటలు పాడుతోన్న టైమ్ లోనే వాళ్లంతా వేదిక దిగి వెళ్లిపోతున్నారట. కనీసంట తన పాట పూర్తయిన తర్వాత వెళ్లినా బావుండేది.. సగంలోనే వెళ్లిపోయారట. ఇదే విషయాన్ని చెబుతూ.. అసలు రాజకీయ నాయకులు ఇలాంటి కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ లేకపోతే రావొద్దు అని చెబుతున్నారు. కళాకారులను అవమానిస్తే అది ‘సరస్వతి దేవి’ని అవమానించినట్టే అంటూ సెంటిమెంట్ తో కొట్టాడు. అయినా తనో పెద్ద సింగర్ అనే భావన ఆయనకూ ఉంటుంది కదా. అలాంటి తను పాడుతున్నప్పుడు మధ్యలోనే వెళ్లిపోతే అవమానమే కదా. అందుకే తన ఆవేదనను ఇలా వీడియో రూపంలో చెబుతూ.. రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లొద్దదని అభిమానులంతా అదే పనిగా మెసేజ్ లు చేస్తున్నారు. అయితే తను కాదు.. రాజకీయ నాయకులే రావొద్దు అంటున్నాడు ఈయన. మరి సోనూ నిగమ్ కు బాలీవుడ్ నుంచి సపోర్ట్ ఉంటుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story