Sonu Sood Help : శివశంకర్ మాస్టర్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సోనూసూద్..!

Sonu Sood Help : ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే.. కరోనాతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు చెపుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి ఖర్చులు బాగా పెరిగిపోయాయని సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శివశంకర్ కుటుంబసభ్యులతో సోనూసూద్ మాట్లాడారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు సోనూసూద్. కాగా శివశంకర్ మాస్టర్ తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా సినిమాలు చేశారు.నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. కేవలం డాన్స్ మాస్టర్ కాకుండా దాదాపుగా ఓ ముప్పై చిత్రాలలో ఆయన నటించారు.
Iam already in touch with the family,
— sonu sood (@SonuSood) November 25, 2021
Will try my best to save his life 🙏 https://t.co/ZRdx7roPOl
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com