Sonu Sood: సోనూ సూద్ మరో సాయం.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్‌ను అందించి..

Sonu Sood (tv5news.in)
X

Sonu Sood (tv5news.in)

Sonu Sood: మరోసారి మానవత్వానికి చాటుకున్నారు నటుడు సోనూసూద్.

Sonu Sood: మరోసారి మానవత్వానికి చాటుకున్నారు నటుడు సోనూసూద్. అత్యవరస పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న పేద మహిళకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్‌ను పంపారు సోనూసూద్‌. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం అత్తిసతం గ్రామంలో సాలమ్మ అనే మహిళ తీవ్ర అనార్యోగంతో బాధపడుతోంది. దీనికి తోడు ఆమెకు ఆర్ధిక సమస్యలు సైతం అధికంగా ఉన్నాయి.

దీంతో.. సాయం చేయాలంటూ.. సోనూసూద్‌ ఫౌండేషన్‌ను కోరారు. ఈ ఫౌండేషన్‌ సభ్యుడైన పురుషోత్తం చొరవ తీసుకుని.. ఈ విషయాన్ని సోనూసూద్‌కు తెలిజేశాడు. వెంటనే స్పందించిన సోనూసూద్‌.. సాలమ్మకు వైద్య పరికరాలు అందించారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న తమ విషయం తెలసుకుని సహాయం చేసిన సోనూసూద్‌కు, వారి ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు సాలమ్మతో ఆమె కుటుంబ సభ్యులు.

Tags

Next Story