వంద కోట్ల సినిమా కంటే అదే ఎక్కువ సంతృప్తినిచ్చింది : సోనూసూద్

వంద కోట్ల సినిమా కంటే అదే ఎక్కువ సంతృప్తినిచ్చింది : సోనూసూద్
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే..దీంతో ఆసుపత్రుల్లో బెడ్స్‌,ఆక్సిజన్‌ కి కొరత ఏర్పడుతుంది.

గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చి దేవుడిలా నిలిచాడు నటుడు సోనూసూద్.. అంతటితో తన సేవలను ఆపకుండా ఏ కష్టం వచ్చిన కాదనకుండా సాయం చేస్తున్నాడు. ఇప్పటికీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ తన సేవలను కొనసాగిస్తున్నాడు సోనూసూద్.. తాజాగా దేశంలో పరిస్థితులను చూసి చలించిపోయాడు ఈ రియల్ హీరో.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే..దీంతో ఆసుపత్రుల్లో బెడ్స్‌,ఆక్సిజన్‌ కి కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో వాటిని ఏర్పాటు చేసి తన వంతు సాయం చేస్తున్నాడు. ఇటీవల ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా కోవిడ్‌ బాధితురాలిని చికిత్స కోసం నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ చేర్చాడు. ఈ విషయాన్నీ సోనూసూద్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

100 కోట్ల సినిమాలో నటించడం కంటే ప్రజలకు సేవచేయడం ఎంతో సంతృప్తిని అందిస్తుందని తెలిపాడు. 'అర్ధరాత్రి చాలా ఫోన్లు వచ్చాయి. వీరిలో కొంతమందికైనా బెడ్స్‌, ఆక్సిజన్‌ అందించడం.. వారి ప్రాణాలను నేను కాపాడుకోగలిగితే ఒట్టేసి చెబుతున్నాను అది 100 కోట్ల సినిమా చేయడం కంటే కొన్ని లక్షలరెట్లు ఎక్కువ సంతృనిస్తుంది. ప్రజలు ఆసుపత్రుల ఎదుట బెడ్స్‌ కోసం ఎదురు చూస్తుంటే మేమెలా పడుకోగలం..' అని ట్వీట్‌ చేశాడు.

సోనూసూద్ చేసిన ఈ సహాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ నెల 17 న కరోనా బారిన పడిన సోనూసూద్ త్వరగా కోలుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story