Sonu Sood: 'నువ్వు ఏ పరిశ్రమ వాడివనేది ఇక్కడ అనవసరం'.. జాతీయ భాష వివాదంపై సోనూసూద్..

Sonu Sood: ప్రస్తుతం సినీ పరిశ్రమలో జాతీయ భాష గురించి చర్చ సాగుతోంది. ఇక ఈ చర్చ మెల్లగా గొడవలాగా మారుతూ వస్తోంది. సినీ పరిశ్రమ నుండి జాతీయ భాష గురించి చర్చ రాజకీయంగా మారుతోంది. దీనిపై పలువురు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా రియల్ హీరో సోనూసూద్ కూడా ఈ అంశంపై స్పందించారు..
భారతదేశం అంతటా ఒకటే భాష ఉందని, అదే ఎంటర్‌టైన్‌మెంట్ అన్నారు సోనూసూద్. నువ్వు ఏ పరిశ్రమ వాడివనేది ఇక్కడ అనవసరమని అన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచగలిగితే వారు నిన్ను ఆదరిస్తారని, గౌరవిస్తారని తెలిపారు. అంతే కాకుండా సౌత్ సినిమాల ప్రభావం భవిష్యత్తు హిందీ సినిమాలపై ఉంటుందని తెలిపారు. ప్రేక్షకుడి అభిరుచిలోనూ మార్పు వచ్చిందని, సినిమాలో కంటెంట్‌ను కోరుకుంటున్నాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక యావరేజ్ సినిమా చూసేందుకు వేల రూపాయలు ఖర్చు చేయాలని ప్రేక్షకులు అనుకోవడం లేదని స్పష్టం చేశారు సోనూసూద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com