నా భార్య తెలుగింటి ఆడపడుచే.. నేను తెలుగింటి అల్లుడినే : సోనుసూద్

నా భార్య తెలుగింటి ఆడపడుచే.. నేను తెలుగింటి అల్లుడినే : సోనుసూద్
నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చాలు.. సినిమాకి సంబంధించిన చాలా విషయాలు నేను తెలుగు ఇండస్ట్రీ నుంచే నేర్చుకున్నాను.

నా భార్య సోనాలి తెలుగింటి ఆడపడుచేనని, తానూ తెలుగింటి అల్లుడినేని అన్నారు నటుడు సోనూసూద్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో గజ అనే పాత్రలో నటించి మెప్పించారు సోనుసూద్.. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న సోనూసూద్.. తెలుగు చిత్ర పరిశ్రమపైన తనకున్నా అభిమానాన్ని చాటుకున్నాడు.

ముందుగా తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చాలు.. సినిమాకి సంబంధించిన చాలా విషయాలు నేను తెలుగు ఇండస్ట్రీ నుంచే నేర్చుకున్నాను. నా భార్య సోనాలి కూడా తెలుగింటి ఆడపడుచే.. నేను తెలుగింటి అల్లుడినే అంటూ చెప్పుకొచ్చారు సోనూసూద్.. బెల్లంకొండ సురేష్‌‌.. మీరంటే నాకెంతో అభిమానం.

మీ సినిమాలో పాత్ర ఉందని కేవలం ఫోన్‌ చేస్తే చాలు నేను వచ్చేస్తాను, పాత్ర ఏంటి స్క్రిప్ట్ ఏంటని కూడా అగడను.. నాకు అల్లుడు అదుర్స్ చిత్రంలో మంచి పాత్రను ఇచ్చారు ధన్యవాదాలు.. శ్రీనివాస్ మంచి నటుడు.. బాగా కష్టపడుతాడు. బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపాడు సోనూసూద్.. అటు సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో చాలా మంది వలస కూలీలకి హెల్ప్ చేసిన సంగతి తెలిసిందే!

Tags

Next Story