వారికి ఉచిత విద్యను అందించాలి : సోనూసూద్

వారికి ఉచిత విద్యను అందించాలి : సోనూసూద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి నటుడు సోనూసూద్ విజ్ఞప్తి చేశాడు.కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలని కోరాడు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి నటుడు సోనూసూద్ విజ్ఞప్తి చేశాడు.కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలని కోరాడు. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోని షేర్ చేశాడు సోనూసూద్. దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వలన చాలా మంది చనిపోతున్నారని... దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని ఆవేదనని వ్యక్తం చేశాడు. ప్రభుత్వ, ప్రోవేటు స్కూళ్ళు, ఇంటర్, డీగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా అన్నీ కోర్సులు అందించాలని అన్నారు. తల్లిదండ్రులు మరణంతో వారు దిక్కులేని వారు అవుతారు కాబట్టి తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సోనూసూద్ కోరాడు. దీనికి గాను నెటిజన్లు సోనూసూద్ ని అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story