Soul Of Satya: సైనికుడి జీవితాన్ని కళ్లకద్దినట్టు చూపించిన సుప్రీం హీరో, కలర్స్ స్వాతి

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'సోల్ ఆఫ్ సత్య' పేరుతో ఓ సాంగ్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశం కోసం పోరాడి, అమరుల త్యాగాలను స్మరించుకుంటున్న ఈ సమయంలో.. ఓ సైనికుడి జీవితాన్ని సాయి ధరమ్ తేజ్ చక్కగా అభినయించాడు. ఈ సాంగ్ ను ఆయన దేశం కోసం పోరాడుతున్న ఎంతోమంది సైనికులకు, వారి కుటుంబాలకు అంకితం చేశాడు. అప్పుడే పెళ్లయిన ఒక కొత్త జంట మధ్య జరిగే చిన్న చిన్న సరదాల దగ్గర నుండి మొదలయిన ఈ వీడియో సాంగ్.. తర్వాత ఎన్నో ములపులు తిరుగుతూ మన సైనికుల జీవితాల దగ్గర ఆగిపోతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘సోల్ ఆఫ్ సత్య’ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.
సోల్ ఆఫ్ సత్య వీడియో సాంగ్ ను హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా చెర్రీకి థ్యాంక్య్ కూడా చెప్పాడు. ‘థ్యాంక్యూ చరణ్. నువ్వు ఈ కావ్యాన్ని సరిహద్దులు దాటి ఎంతో దూరాన ఉన్న హీరోల దగ్గరకు తీసుకెళ్లావు. ఇదే సోల్ ఆఫ్ సత్య. మా మనసులు దీన్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ప్రేమిస్తారని అనుకుంటున్నాను’ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
Yet again,
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 14, 2023
Destiny proves it Magic!!!
The Man who introduced us to each other and bloomed our friendship is now releasing the #TheSoulOfSatya from the Ode to the Unsung warriors we both have made together.
Thank you Charan @AlwaysRamCharan for introducing me to this amazing human… pic.twitter.com/lthtc5xhZO
ఇక ‘సోల్ ఆఫ్ సత్య’ విషయానికొస్తే ఇందులో స్వాతి, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించారు. వీరిద్దరూ కూడా ఈ సాంగ్ లో అద్భుతంగా, నేచురల్ గా నటించారు. దీంతో వీరి పెయిర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా రిఫ్రెషింగ్‌గా, క్యూట్‌గా ఉన్నారని ప్రశంసిస్తున్నారు. ‘సోల్ ఆఫ్ సత్య’కు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ ఆల్బమ్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదలయ్యింది. ఇదిలా ఉండగా బుల్లితెరపై వచ్చే పలు మ్యూజిక్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమయిన శృతి రంజనీ.. ‘సోల్ ఆఫ్ సత్య’కు మ్యూజిక్‌ను అందించే స్థాయికి ఎదిగింది. ఈ పాటకు ఆమె మ్యూజిక్‌ను కంపోజ్ చేయడం మాత్రమే కాదు.. ఆమే స్వయంగా పాడింది కూడా. ఆమెకు వచ్చిన అరుదైన అవకాశాన్ని చాలా బాగా యూజ్ చేసుకుందని ఈ పాటతో ఆమె నిరూపించుకుంది.
‘సోల్ ఆఫ్ సత్య’లో కీ రోల్ చేసిన కలర్స్ స్వాతి చాలా కాలం తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ఆమె అభిమానులు, ప్రేక్షకులంతా చాలా సంతోషిస్తున్నారు. ఒకప్పుడు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మన తెలుగింటి అమ్మాయిగా వెలిగిపోయిన స్వాతి.. ‘సోల్ ఆఫ్ సత్య’తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందని వారంతా ఆశిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com